
- అభ్యర్థులపై పెండింగ్ కేసులుంటే మీడియాలో పబ్లిష్చెయ్యాలి
- నేరాభియోగాలు ఉన్నవారిని అభ్యర్థులుగా పెడితే ఎందుకో వెల్లడించాలి
- పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ డిపాజిట్ కౌంటర్లు
- రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు:ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల కోడ్అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, హెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. అయితే, గ్రేటర్‌పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ గురించి చెప్పడంతో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ఈ నెల 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు.
అప్పటి నుంచే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ , ప్రైవేట్ ప్రాపర్టీలపై ఉన్న రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు తొలగించడం ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ప్రాపర్టీలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒకవేళ ప్రైవేట్ ప్రాపర్టీలపై ప్రచార ప్రకటనలు పెడితే అనుమతి తీసుకోవాలన్నారు.
ఇప్పటికే తొలగించిన ప్రదేశాలలో పర్మిషన్‌లేకుండా మళ్లీ ప్రకటనలు ఏర్పాటు చేస్తే తొలగించి కేసులు నమోదు చేస్తామన్నారు. ఆ ఖర్చును బాధ్యుల పార్టీ ఖాతాల్లో వేస్తామన్నారు.షేక్ పేట తహసీల్దార్ ఆఫీస్ లో రిటర్నింగ్ ఆఫీసర్కార్యాలయం ఏర్పాటు చేశామని, ఈ నెల 13 నుంచి నామినేషన్లు అక్కడే స్వీకరిస్తామన్నారు. ఈసారి ఓటర్లు పోలింగ్ కేంద్రానికి మొబైల్స్‌తో రావొచ్చని, అయితే, అక్కడ ఏర్పాటు చేసిన మొబైల్ డిపాజిట్ కౌంటర్లలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు.
1620 పోస్టర్లు తొలగింపు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను కట్టుదిట్టంగా ఎన్నికల అధికారులు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,620 రాజకీయ పార్టీల పోస్టర్స్, వాల్ రైటింగ్, బ్యానర్స్ గుర్తించారు. ఇందులో అనుమతులు లేని ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించారు.
ఎక్కడైనా కోడ్ ఉల్లంఘించినట్లు గుర్తిస్తే 1950 ఎలక్షన్ హెల్ప్‌లైన్, సి-విజిల్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. 24 గంటలు ఫిర్యాదులను పర్యవేక్షించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు సీరియస్‌గా పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అధికారులకు ఆదేశించారు.
పెండింగ్‌కేసుల గురించి చెప్పాలె..
ఎన్నికల సంఘం విడుదల చేసిన నిబంధనల ప్రకారం తమ అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న కేసులతోపాటు క్రిమినల్అభియోగాల గురించి రాజకీయ పార్టీలు మీడియాకు వెల్లడించాలన్నారు. ఒక వేళ నేరాభియోగాలు ఉన్న వారిని అభ్యర్థులుగా పెడితే వారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో తెలియజేయాలన్నారు. ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు
ఉంటాయన్నారు.
ఎంసీఎంసీ, మీడియా కేంద్రం ప్రారంభం
రాజకీయ పార్టీలు తమ ప్రచార ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని కర్ణన్చెప్పారు. సమావేశానికంటే ముందు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని సీపీఆర్ ఓ సెక్షన్ లో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని..ఎలక్షన్అడిషనల్కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, పీఆర్ఓ దశరథంతో కలిసి కర్ణన్ప్రారంభించారు. హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు బుక్ చేస్తామన్నారు.
-డీసీపీ అపూర్వ రావు, రిటర్నింగ్ ఆఫీసర్పి సాయిరాం-
రూ.4 లక్షల నగదు, మద్యం బాటిల్స్ స్వాధీనం
ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పంజాగుట్ట పోలీసులు శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఒక కారులో రూ.4 లక్షల నగదు, 9 చివాస్ రీగల్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
అందుకే నియోజకవర్గం వరకే కోడ్
ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మునిసిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితో పాటు మెట్రోపాలిటన్ నగరంలో భాగస్వామ్యం కావడంతో కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పకడ్బందీగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందని కర్ణన్ స్పష్టం చేశారు.