జూబ్లీహిల్స్ ఫైనల్ రిజల్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

జూబ్లీహిల్స్ ఫైనల్ రిజల్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

నిన్న ఫలితం రాకుండా నిల్చిపోయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ  స్థానం ఓట్ల లెక్కింపు మరోసారి నిర్వహించిన తర్వాత తుది ఫలితం సోమవారం( డిసెంబర్4) న ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 16వేల 337 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు 80వేల 328 ఓట్లు రాగా..కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కు 63వేల 8385 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25వేల 756 ఓట్లు, ఎంఐం ఎం అభ్యర్థి ఫలాజుద్దీన్ 7వేల 829 ఓట్లు సాధింంచారు. 

ఆదివారం జరిగిన కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠ రేకెత్తించిన ఓట్ల లెక్కింపులో మాగంటి గోపీనాథ్ స్వల్ప ఆధిక్యం నుంచి చివరికి స్పష్టమైన మెజార్టీని సొంతం చేసుకున్నారు.  మధ్య లో స్పల్ప అపశృతి తలెత్తడంతో కౌంటింగ్ ను మధ్యలో నిలిపివేశారు. కొన్ని ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. 

ఈక్రమంలో 11వ రౌండ్ లో 2ఈవీఎంలు, 12వ రౌండ్ లో మరో రెండు ఈవీఎంలు, 13 వ రౌండ్ లో 1 ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయా ఈవీఎంల లెక్కింపును ఎన్నికల అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, సంబంధిత పార్టీ ప్రతినిధులకు ఎన్నికల నిబంధనలు వివరించి కౌంటింగ్ కొనసాగించారు. దీంతో నిలిచిపోయిన వీవీ ప్యాట్ల లెక్కింపును మొత్తం 26 రౌండ్లు పూర్తయ్యాక తిరిగి ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 26 రౌండ్లు పూర్తయ్యేవరకు బీఆర్ ఎస్ అభ్యర్థి 16,490 వేల మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ లో 153ఓట్ల మెజార్టీ తగ్గడంతో 16వేల 337 ఓట్ల ఆధిక్యంతో మాగంటి గోపీనాధ్ గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల అధికారులు.