మైనర్ నిందితుల ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్ పోలీసులు

మైనర్ నిందితుల ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో బాలికపై అఘాయిత్యం కేసులో ప్రధాన నిందితుడితో పాటు ఐదుగురు మైనర్ల విచారణ కొనసాగుతోంది. కేసులో ఏ1గా ఉన్న సాదుద్దీన్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మరోవైపు ఐదుగురు మైనర్లను సైతం జువైనల్ హోం నుంచి ప్రైవేటు వాహనాల్లో ఉస్మానియాకు తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్ సుధాకర్ నేతృత్వంలోని వైద్య బృందం ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్తో పాటు ఐదుగురు మైనర్ నిందితులకు పొటెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు.  వైద్య పరీక్షలకు దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. అక్కడ నిందితులందరినీ కలిపి ప్రశ్నించనున్నారు. అనంతరం అధికారులు ఒక్కో నిందితున్ని ప్రత్యేకంగా విచారించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్  రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం.