
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కారు జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడి ఈవో. ఓ అర్చకుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈవో అంజనారెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సస్పెండ్ అయిన అర్చకుడిని విధుల్లోకి తీసుకొనేందుకు రూ.5లక్షలు డిమాండ్ చేయగా.. ఇద్దరి మధ్యా రూ.4లక్షలకు డీల్ కుదిరింది. దీనిలో భాగంగా మంగళవారం అర్చకుడి నుంచి రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈవోను పట్టుకున్నారు.