వృద్ధ దంపతులకు న్యాయం చేసిన జడ్జి

వృద్ధ దంపతులకు న్యాయం చేసిన జడ్జి

నర్సాపూర్, వెలుగు : వృద్ధుల ఆలనా పాలన కొడుకులు, కూతుళ్లు చూడాలని లేదంటే సీనియర్​ సిటిజన్​చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత హెచ్చరించారు. మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన గండి లచ్చయ్య తులసమ్మ దంపతులు కష్టపడి సంపాదించిన  ఆస్తులను కొడుకు మధుసూదన్ గౌడ్  మోసపూరితంగా రాయించుకొని వారిని పట్టించుకోవడం లేదు.

దీంతో న్యాయం చేయాలని వారు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీని ఆశ్రయించగా శుక్రవారం మండల్ లీగల్ సర్వీస్ అధారిటీ చైర్మన్, సివిల్ జడ్జి అనిత  వారి కొడుకుకు బుద్ధి చెప్పి ఆస్తులను స్వాధీనం చేసుకొని వారికి అప్పజెప్పారు. కార్యక్రమంలో లాయర్ శ్రీనివాస్, మధు శ్రీ, లీగల్ సర్వీస్ లాయర్ స్వరూప రాణి, కోర్టు సూపరింటెండెంట్ పద్మావతి, లీగల్ సర్వీస్ సిబ్బంది శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్స్ దిలీప్ కుమార్, ఉమారాణి పాల్గొన్నారు.