కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక : జడ్జి సాయి రమాదేవి

కేసుల పరిష్కారానికి  లోక్ అదాలత్ చక్కటి వేదిక : జడ్జి సాయి రమాదేవి
  •     జడ్జి సాయి రమాదేవి

సిద్దిపేట రూరల్, వెలుగు: పెండింగ్ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. శనివారం జిల్లా కోర్ట్ ఆవరణలో స్పెషల్ లోక్ అదాలత్ ను అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సంతోష్ కుమార్ తో కలసి ప్రారంభించారు. 

జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ ఒకసారి లోక్ అదాలత్ లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో 310 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులతో పాటు, 3 మోటారు ప్రమాద కేసుల్లో రూ. 45,80,000 లను అందజేసినట్లు తెలిపారు. 

కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జయ ప్రసాద్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్, జడ్జిలు సాదన, తరణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్ధన్ రెడ్డి  పాల్గొన్నారు.