
హైదరాబాద్ వెలుగు : స్మార్ట్ హోమ్ సొల్యూషన్‌లకు ప్రసిద్ధి చెందిన ఐఓటీ కంపెనీ హోగర్ కంట్రోల్స్, తన మాజీ డైరెక్టర్లు విజయ్ కుమార్ , కరుణ్ కుమార్‌తోపాటు మరి కొందరిపై ట్రేడ్‌మార్క్ కేసులో ఢిల్లీ హైకోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ పొందింది. మాజీ డైరెక్టర్ల కేసు బలంగా లేకపోవడం వల్ల తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని హోగర్ కంట్రోల్ తెలిపింది. డిజిటల్, ప్రింట్ తో సహా ఏ రూపంలోనూ వ్యాపారచిహ్నాలను, సంబంధిత మెటీరియల్‌లను ఉపయోగించడం లేదా రీప్రొడ్యూస్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.