జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం

జూలై 13న   చంద్రయాన్-3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగ తేదీని వెల్లడించింది.  2023జూలై 13న మధ్యాహ్నం 2:30 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది. దీనికోసం రూ. 615 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 

ఈ ప్రయోగంపై శాస్రవేత్తలతో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ సమీక్ష నిర్వహించారు.  చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో ముందస్తుగానే చర్యలు చేపట్టింది. సమస్యలను నిరోధించేందుకు హార్డ్ వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్, సాఫ్ట్ వేర్, సెన్సార్లలో కీలక మార్పులు చేసినట్లు సోమనాథ్‌ తెలిపారు. 

అలాగే ల్యాండింగ్‌ సమయంలో కిందికి దిగి సమయంలో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు.