నిలోఫర్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళన

నిలోఫర్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళన

నిలోఫర్ హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15న హాస్పిటల్ లో  10 నెలల పసి పాప అనారోగ్యంతో చనిపోయింది. దీనికి జూనియర్ డాక్టరే కారణమంటూ అతడిపై పాప బంధువులు దాడి చేశారు. దీంతో డ్యూటీ బైకాట్ చేసి, నిరసన తెలుపుతున్నారు జూడాలు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. హాస్పిటల్ లో పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటున్నారు.

మరోవైపు జీతాలు ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. 3నెలలుగా జీతాలు రాకపోవడంతో  కుటుంబాలు గడవటం ఇబ్బందిగా ఉందంటున్నారు.

ప్రభుత్వ చిల్డ్రన్ హాస్పిటల్ నిలోఫర్ లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటికే చాలాసార్లు ఆస్పత్రి సిబ్బందిపై దాడులు జరిగాయి.పర్మినెంట్ స్టాఫ్ లేకపోవడం, ఔట్ సోర్సింగ్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే వీళ్లకు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వడంల ఆలస్యం చేయడంతో సమ్మె చేస్తున్నారు. అయితే దాడిపై విచారణ జరుపుతున్నామన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ.