
బషీర్ బాగ్/పద్మారావునగర్/ముషీరాబాద్, వెలుగు: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ సిటీలోని జూనియర్‌డాక్టర్లు మంగళవారం ట్యాంక్‌బండ్‌పై భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘జస్టిస్ ఫర్ ఆర్ జీ కర్’ పేరుతో 125 అడుగు అంబేద్కర్‌విగ్రహం వద్ద క్యాండిల్స్‌తో నిరసన తెలిపారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఈఎస్ఐ హాస్పిటళ్లలోని జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తెలియజేస్తూ జూడాలు చేసిన స్కిట్ అక్కడున్నవారిని కన్నీరు పెట్టించింది. కోల్‌కతా ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపించాలని జూడాలు డిమాండ్ చేశారు.
అలాగే మంగళవారం కూడా గాంధీ హాస్పిటల్‌లోని జూనియర్‌డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఓపీ వార్డుతో పాటు ఎలెక్టివ్ఓటీ డ్యూటీలను బహిష్కరించారు. మెయిన్ బిల్డింగ్ముందు బైఠాయించి ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. కోల్‌కతా ఘటనను నిరసిస్తూ ఆలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్‌వద్ద స్టూడెంట్లు ఆందోళన చేశారు. స్టూడెంట్ ఆర్గనైజర్ జె.వినోద్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు.