
హైదరాబాద్ : నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న రాష్ట్ర జూనియర్ శుక్రవారం సమ్మె విరమించారు.దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ ను కలిశారు జూనియర్ డాక్టర్లు. బిల్లులో మార్పు తెస్తామని ఈటల హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. సమ్మె విరమణపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “NMC బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రంతో మాట్లాడతామని చెప్పాం. చెప్పినట్లుగానే గురువారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడాం.
డాక్టర్ల ప్రయోజనాలకు ఇబ్బంది కాబోదని కేంద్రమంత్రి చెప్పారు. జూనియర్ డాక్టర్లకు కేంద్రమంత్రితో చర్చల సారాంశాన్ని వివరించాం. నిబంధనల తయారీ సందర్భంలో అందరి అభిప్రాయాలు చెబుతామని హర్షవర్ధన్ అన్నారు. ప్రగతి నిరోధకంగా ఉన్న వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారని తెలిపారు ఈటల. ఇదే విషయపై సమ్మె విరమించాలని జానియర్ డాక్టర్లను కోరితే సానుకూలంగా స్పందించారని తెలిపారు మంత్రి ఈటల రాజేంధర్.