జగిత్యాలలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందారు. శనివారం (డిసెంబర్27) తెల్లవారు జామున ఇంట్లో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు.
ఇటీవల జగిత్యాల జిల్లా ఇంఛార్జి డిఎం హెచ్ వోగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ శ్రీనివాస్ ది సొంతూరు జగిత్యాల కావడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకొన్నారు.
ఎంతో సౌమ్యుడిగా పేరున్న DMHO శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
