
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. జులై 18న థియేటర్లలో విడుదలైన జూనియర్ మోస్తరు కలెక్షన్స్ రాబడుతోంది. రెండ్రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.3.15కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం థియేటర్లో జూనియర్కి పోటీగా పెద్ద సినిమాలేవీ లేవు. ఈ క్రమంలో వీకెండ్తో పాటుగా సోమవారం పండుగ సెలవు కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
జూనియర్ మొదటిరోజు శుక్రవారం రూ.1.5కోట్ల నెట్ రాబట్టగా.. (తెలుగులో రూ.1.3కోట్లు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు) ఇలా జూనియర్ ప్రపంచవ్యాప్తంగా రూ.2.20 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. రెండోరోజు మొదటిరోజు కంటే బుకింగ్స్ ఎక్కువ నమోదయ్యాయి. ఈ క్రమంలో రూ.1.65 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రెండో రోజు మార్నింగ్ షోలలో తెలుగు వెర్షన్‌లో 16.97 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. కన్నడ వెర్షన్‌లో 11.51 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 250 షోలు, విజయవాడలో 65, విశాఖలో 70షోలు, బెంగళూరులో 134 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి.
జూనియర్ బడ్జెట్ & టార్గెట్:
జూనియర్ మూవీ దాదాపు రూ.25కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు సమాచారం. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ మూవీని వరల్డ్ వైడ్గా 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.