ఎన్టీఆర్ వీరాభిమాని ఇరవై ఏళ్ల శ్యామ్ ఆత్మహత్య

ఎన్టీఆర్ వీరాభిమాని ఇరవై ఏళ్ల  శ్యామ్ ఆత్మహత్య

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనతో ఎన్టీఆర్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అతిచిన్న వయసులో శ్యామ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణంచుకోలేకపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అతని మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్నారు. 

ఇక శ్యామ్ కు చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఆయన సినిమా ఏదైనా మొదటిరోజే చూసేవాడు. ఇక ఎన్టీఆర్ సినిమాలకు. కటౌట్స్ కట్టడం, దండలు వేయడం, పాలాభిషేకాలు చేయడంలో ముందుండే వాడు. ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ కి వచ్చిన అక్కడ ఖచ్చితంగా ఉండేవాడు శ్యామ్. ఎన్టీఆర్ అంటే శ్యామ్ కు అంత పిచ్చి. 

ఇక రీసెంట్ గా ధమ్కీ మూవీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా.. అక్కడ ఉన్న సెక్యూరిటీని తోసేసుకొని మరీ వెళ్లి ఎన్టీఆర్ ను గట్టిగా పట్టేసుకున్నాడు. అంతలా ఎన్టీఆర్ ను అభిమానించేవాడు శ్యామ్. అలాంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోవడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. శ్యామ్ ఎన్టీఆర్ ను హత్తుకున్న వీడియోను షేర్ చేస్తూ.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.