
రెండు రాష్ట్రాల తెలుగువారంతా ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. 2023 మే 28వ తేదీకి ఆయన జన్మించి 100 సంవత్సరాలు అవుతోంది. దీంతో నందమూరి ఫ్యామిలీ, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాతకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో.. మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు ఎన్టీఆర్. అయితే ప్రతి సంవత్సరం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేవారు. కానీ ఈ సారి ఎన్టీఆర్ ఒక్కడే వచ్చాడు.