
తమ కొత్త సినిమాల అప్డేట్స్ గురించి ఇంట్లో ఉండే భార్య కంటే ముందుగా తమ అభిమానులతోనే ముందుగా చెబుతామని హీరో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ నెలలో తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని ఎన్టీఆర్ ప్రకటించారు. మార్చి 20నుంచి రెగ్యూలర్ షూటింగ్ ఉంటుదని చెప్పాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న మూవీని రిలీజ్ చేస్తామన్నాడు. అప్డేట్స్ గురించి హీరోలు, దర్శకనిర్మాతలపై ఒత్తిడి తీసుకురావొద్దని అభిమానులను కోరాడు.అభిమానులు అడిగినప్పుడల్లా సినిమా అప్‌డేట్‌లు ఇవ్వడం కుదరదన్నాడు. అదిరిపోయే అప్‌డేట్ ఉంటేనే అభిమానులకు చెబుతామన్నాడు. ఎన్టీఆర్ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. ఇక అమిగోస్ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.