Jr.NTR వాచీ ఖరీదు రూ.2 కోట్ల 45 లక్షలా.. సెకన్ కూడా తేడా రాదంట!

Jr.NTR వాచీ ఖరీదు రూ.2 కోట్ల 45 లక్షలా.. సెకన్ కూడా తేడా రాదంట!

ఇండియాలో ఉన్న స్టార్ యాక్టర్స్ లలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఒకరు. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.60 నుండి రూ.70 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. ఇక ఆయన వాడే కార్లు, జడ్జెట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. వాటి కోసం కోట్లలో ఖర్చు చేస్తారు. ఇక ఎన్టీఆర్ కు వాచెస్ అనే చాలా మక్కువ. తాజాగా ఆయన పెట్టుకున్న వాచ్, దాని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

ఇటీవల ఎన్టీఆర్ నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ తోపాటు.. కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన వాచీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిచింది. అదే ఏ బ్రాండ్? దీని ధర ఎంత? అని ఇంటర్నెట్ లో సర్చింగ్ కూడా మొదలుపెట్టేశారు. తీరా ఆ వాచ్ రేటు చూసి అవాక్కవుతున్నారు.

ఆ వాచ్ పాటక్ ఫిలిప్ అనే స్విట్జర్లాండ్ కు చెందిన లగ్జరీ బ్రాండెడ్ చెందినని. చూడటానికి చాలా క్యాజువల్ అండ్ సింపుల్ గా ఉన్న దీని ఖరీదు రూ. 2.45 కోట్లకు పైనే ఉంటుందట. తారక్ ఇంతకుముందు కూడా RRR ప్రమోషన్స్ లో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకొని కనిపించాడు. దాని ధర కూడా రూ. 1 కోటి 56 లక్షల పైనే ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. 2024 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.