కౌంట్ డౌన్ మాకు కాదు మీకే మొదలైంది : జూపల్లి

కౌంట్ డౌన్ మాకు కాదు మీకే మొదలైంది  : జూపల్లి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కడియం శ్రీహరిలపై  మంత్రి జూపల్లి కృష్ణారావు  ఫైరయ్యారు.  కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని దీవించాలి తప్పా కూలిపోతుంది అనే ఫూలిష్ మాటలు మాట్లాడటం సబబు కాదన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన‌ ప్రతి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని తెలిపారు.  

కౌంట్ డౌన్ మాకు కాదు మీకు మొదలైందంటూ హెచ్చరించారు మంత్రి జూపల్లి .  ఎన్నికల్లో మీరు ఏ ధైర్యంతో గ్యారంటీలు ప్రకటించారో  చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో చెప్పాలన్నారు.  

రాజేంద్రనగర్ హైదర్ గూడలో మంత్రిని గ్రేటెడ్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఐదోసారి ఘన విజయం సాధించిన‌ మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీ వాసులు పూలమాలలు వేసి సత్కరించారు. తమ కాలనీ లో ఓ మంత్రి ఉండడం చాలా సంతోషమని కాలనీ వాసులు చెప్పారు.