బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమా?: హరీష్ రావుకు జూపల్లి సవాల్

బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమా?:  హరీష్ రావుకు జూపల్లి సవాల్

మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైరయ్యారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై  చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని..సర్వే చేసి పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి. ఎంపీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మేము పంట నష్టం ఇవ్వలేకపోతున్నామని.. దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధికి వాడుకుంటుంది - మంత్రి జూపల్లి మండిపడ్డారు.

Also Read: కవిత.. తెలంగాణ పరువు తీసింది

కాగా,  గత వర్షకాలంలో తక్కవ వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుతం ఎండకాలంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువుల్లో, కుంటు, బావుల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఈ క్రమంలో సాగు నీళ్లు లేక వరి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు.. ఎండిపోయిన పంటపోలాలను పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. క్రమంలో రాజకీయ లబ్దికోసం బీఆర్ఎస్ నాయకులు పాకులాడుతున్నారని మంత్రి జూపల్లి బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు.