జ్యోతిష్యం : గురుడు.. శుక్రుడు.. కలయిక.. వ్యాపారస్తులకు అదృష్టయోగం.. ఎప్పటి వరకంటే..!

జ్యోతిష్యం : గురుడు.. శుక్రుడు.. కలయిక..  వ్యాపారస్తులకు అదృష్టయోగం.. ఎప్పటి వరకంటే..!

 జ్యోతిష్యశాస్త్రం వృషభరాశిలో గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఆర్థిక కేంద్ర యోగం ఏర్పడింది.   ఈ గ్రహాల కలయిక వలన ఏర్పడిన శుభయోగం ప్రభావం 6 నెలలు ఉంటుంది.  నవ గ్రహాలలో గురుడికి, శుక్రుడి ఎంతో ప్రాధాన్యత ఉంది. గురుడిని సంపద, మేధస్సు, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు.

 శుక్రుడిని అందం, వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు. అత్యంత శుభప్రదమైన ఈ రెండు గ్రహాలు కలిసి ఒక ప్రత్యేక, శక్తివంతమైన యోగాన్ని ఏర్పరిచాయి.  ఈ యోగం ప్రభావం 6 నెలలు ఉంటుంది.  జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం ఈ శుభ యోగం అక్టోబర్ 8 న ఏర్పడింది.  ఈ అరుదైన యోగాన్ని అవకాశ కోణం అని పిలుస్తారు -. ఇలా గురుడు.. శుక్రుడు కలిసి శుభయోగం ఏర్పడటంతో  2025 అక్టోబర్​ నెల పెట్టుడులకు  చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం  గురుడు.. శుక్రుడు  రెండు గ్రహాలు 60 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు సెక్స్టైల్ యోగం  సంభవిస్తుందట.  ఈ యోగంలో అనేక ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. ఉద్రిక్తతలతో పాటు ..సంపద కూడా పెరుగుతుంది.  శుక్రుడు.. గురుడు ఆరవస్థానంలో శుభయోగం ఏర్పడడంతో  కొన్ని అనుకూల మార్పులు జరుగుతాయి. వ్యాపారస్తులకు బ్రాండ్​ ఇమేజ్​ పెరుగుతుంది. గురుడు.. శుక్రుడు ఇద్దరూ ప్రశంసలకు ప్రతిస్పందిస్తారని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ  అనిశ్చితి నుండి కోలుకుంటున్న సమయంలో ఈ సెక్స్టైల్ జరుగుతుంది.ఈ సమయంలో గురు, శుక్ర గ్రహాలు 45 డిగ్రీల కోణంలోకి వచ్చాయి. జ్యోతిష్యం ప్రకారం, ఈ సమయంలో అర్థ కేంద్ర యోగం ఏర్పడింది.  దీంతో కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరమైన రంగాల్లో ప్రత్యేక విజయాలు సాధించే అవకాశం ఉంది

గురుడు.. శుక్రుడు రెండూ శుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు.  గురుడు ఆశను.. శుక్రుడు సంపదను పెంచుతాడు.    జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాలు ..  విలీనాల పెట్టుబడులు వ్యూహాత్మక పొత్తులను కోరుకునే వ్యాపారాలు కలసి వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా.. కొత్త ప్రాజెక్ట్​ ల విషయంలో ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

 శుక్రుడు  సమతుల్యతను కలుగజేస్తాడు. సృజనాత్మకత రూపొందించడంలో శుక్రుడు కీలక పాత్ర పోషిస్తాడు. గురుడు  మంచి ఆలోచనలను  విస్తరించేందుకు.. పలు దేశాల  మధ్య సంబంధాన్ని  నియంత్రించి లగ్జరీ లైఫ్​ ను అందిస్తాడు. సాంప్రదాయ రంగాలవారికి శుక్రుడు.. గురుడు కలయిక ఏర్పడిన శుభయోగం అనుకూలిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  సమస్యలకు  జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.