జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 317.470 మీటర్ల లెవెల్ ను మెయింటెన్​ చేస్తూ 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 59,625 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి ద్వారా 30,452 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్  లిఫ్ట్  ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్  కెనాల్  ద్వారా 550 క్యూసెక్కులు, రైట్  కెనాల్  ద్వారా280 క్యూసెక్కులు, ఆర్డీఎస్  లింక్  కెనాల్  ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 92,515 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.