
లాభాలతో ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత అంతర్జాతీయ పరిస్థితులతో నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాకపోవటం, గడువు సమయం జూలై 9 దగ్గర పడుతుండటంతో మార్కెట్లలో అలజడి మెుదలైంది. ఈ క్రమంలో ఐపీవోల మార్కెట్లలో లిస్ట్ అయిన హెచ్డీబీ ఫైనాన్షియల్ స్టాక్ మాత్రం లాభాల అరంగేట్రాన్ని చూసింది.
అయితే నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన కల్పతరు, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ఎల్లెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాస్ మంచి లాభాలను చూశాయి. అయిచే నేడు ఈ కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకోవటం ఐపీవో ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మార్కెట్ల ప్రతికూలతలతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపడటమే ప్రస్తుతం ఐపీవోల నష్టాల ట్రేడింగ్ కి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏఏ కంపెనీలు ఎంత మేర నష్టాల్లో ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..
Kalpataru shares:
కల్పతరు కంపెనీ ఐపీవో స్టాక్స్ నిన్న ఫ్లాట్ లిస్టింగ్ చూశాయి. మార్కెట్లోకి ఒక్కోటి రూ.414 రేటు వద్ద ఎంట్రీ ఇచ్చినప్పటికీ చివరికి 4 శాతం లాభంతో రూ.432 రేటు వద్ద నిన్న ప్రయాణాన్ని ముగించాయి. కానీ నేడు మధ్యాహ్నం 12.52 గంటల సమయంలో 4 శాతం నష్టంతో రూ.416 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
Ellenbarrie Industrial Gases shares:
నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఎల్లెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ స్టాక్ నిన్న లిస్టింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.486 వద్ద అడుగుపెట్టింది. వాస్తవంగా కంపెనీ ఇష్యూ ధర రూ.400 కంటే 22 శాతం ప్రీమియం ధరతో నిన్న ఎంట్రీ తర్వాత స్టాక్ మరో 10 శాతం పెరిగి రూ.541కి చేరాయి. అయితే నేడు స్టాక్ 4 శాతానికి పైగా నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
Globe Civil Projects shares:
ఇదే క్రమంలో నిన్న లిస్ట్ అయిన మరో కంపెనీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ స్టాక్. నిన్న కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.71 కంటే 27 శాతం ప్రీమియం రేటు రూ.90 వద్ద జాబితా అయ్యాయి. దీని తర్వాత రూ.94.5 వద్ద క్లోజ్ అయిన స్టాక్ ఇవాళ మాత్రం ఇంట్రాడేలో 5 శాతం వరకు నష్టంతో రూ.89 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.