మనిషిలా మాట్లాడే మివీ ఏఐ బడ్స్

మనిషిలా మాట్లాడే మివీ ఏఐ బడ్స్

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి సరికొత్త గ్లోబల్ టెక్నాలజీని ప్రకటించింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివీ ఏఐ  ప్లాట్‌‌‌‌ఫారమ్ 'మివీ ఏఐ' తో పాటు సరికొత్త 'మివీ ఏఐ బడ్స్'ను విడుదల చేసింది. 

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ మివీ ఏఐ బడ్స్.. మనుషుల మాదిరే మాట్లాడతాయని  తెలిపింది.  కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, సందర్భానుసారంగా మాట్లాడుతాయి. యూజర్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయి.  గత సంభాషణల వివరాలను గుర్తుంచుకుంటాయి. 

"హాయ్ మివీ" అని చెప్పి వీటిని యాక్టివేట్ చేయవచ్చు. ఇది ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా అనుభూతినిస్తుందని మివీ పేర్కొంది. ఏఐ బడ్స్ స్క్రీన్ అవసరం లేకుండానే అనేక పనులను సులభతరం చేస్తాయి. 

ఉద్యోగ ఆఫర్ దగ్గర నుంచి ఇంట్లో పిజ్జా తయారు చేయడం వరకు ఉంటాయి. AI ఎనిమిది భారతీయ భాషలను అర్థం చేసుకుంటుంది.ఎటువంటి సెట్టింగ్స్ మార్చకుండా  హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం,గుజరాతీ భాషల్లో స్పందిస్తుంది.