
కోల్‌బెల్ట్, వెలుగు: ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ప్రారంభించిన సంవిధాన్ లీడర్షిప్ ప్రోగ్రామ్వైట్ టీషర్ట్ ఇనిషియేటివ్ మెమొంటోలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఆవిష్కరించారు. జైపూర్ మండలం ఇందారంలో జరిగిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన మెమొంటోలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల దేశ వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు రాహుల్‌గాంధీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్, యూత్‌కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పాగాల పున్నం యాదవ్ సోదరుడు తిరుపతి యాదవ్ సంవత్సరీక కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. తిరుపతి యాదవ్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.----