రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మంచిర్యాల మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని అన్నారు వివేక్.
గెలుపుపై ధీమా
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. ఆరు రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ను ఆధారం చేసుకొని గెలుపు మాదంటే.. మాదేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఐదు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
