రూ.92 లక్షలతో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే రామారావు పటేల్

రూ.92 లక్షలతో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే రామారావు పటేల్
  • బాసరలో ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్    

బాసర,  వెలుగు: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బాసరలో రూ.92 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, కిర్గుల్ సర్పంచ్ మాలేగా ప్రీతితో కలిసి మంగళవారం ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.20 లక్షలతో డ్రెయిన్ నిర్మాణం, రెండు అంగన్వాడీ కేంద్రాలతో పాటు రూ.21 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

సరస్వతి ఆలయ ఆవరణలో రూ.7 లక్షలతో తాగునీటి పనులకు,  రూ.10 లక్షలతో కిర్గుల్(కె) ప్రభుత్వ స్కూల్​ప్రహరీకి, రూ.10 లక్షలతో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బాసరలోని గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అందరి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోగుల రాజేశ్వర్, మాజీ సర్పంచ్ లు లక్ష్మణ్ రావు, సతీశ్​ రావు, బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్, అధికారులు, స్థానిక నాయకులు    పాల్గొన్నారు.