Gold Rate: రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్.. ట్రంప్ చర్యలతో ఇన్వెస్టర్స్ అలర్ట్.. హైదరాబాదులో

Gold Rate: రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్.. ట్రంప్ చర్యలతో ఇన్వెస్టర్స్ అలర్ట్.. హైదరాబాదులో

Gold Price Today: భారతదేశంలో ప్రధానంగా బంగారాన్ని ఎక్కువ శాతం మంది రిటైల్ వినియోగం కింద ఆభరణాలు కొంటుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొంత పెట్టుబడి కోసం వినియోగం పెరిగిందని చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు తెస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ బంగారంలో కూడా తమ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది పరోక్షంగా డాలర్ విలువను తగ్గిస్తూ గోల్డ్ రేట్లకు రెక్కలొచ్చేలా చేస్తోంది. 

22 క్యా్రెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 105, ముంబైలో రూ.9వేల 105, దిల్లీలో రూ.9వేల 120, కలకత్తాలో రూ.9వేల 105, బెంగళూరులో రూ.9వేల 105, కేరళలో రూ.9వేల 105, పూణేలో రూ.9వేల 105, వడోదరలో రూ.9వేల 110, జైపూరులో రూ.9వేల 120, లక్నోలో రూ.9వేల 120, మంగళూరులో రూ.9వేల 105, నాశిక్ లో రూ.9వేల 108, మైసూరులో రూ.9వేల 105, అయోధ్యలో రూ.9వేల 120, బళ్లారిలో రూ.9వేల 105, గురుగ్రాములో రూ.9వేల 120, నోయిడాలో రూ.9వేల 120 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 400 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 933, ముంబైలో రూ.9వేల 933, దిల్లీలో రూ.9వేల 948, కలకత్తాలో రూ.9వేల 933, బెంగళూరులో రూ.9వేల 933, కేరళలో రూ.9వేల 933, పూణేలో రూ.9వేల 933, వడోదరలో రూ.9వేల 938, జైపూరులో రూ.9వేల 948, లక్నోలో రూ.9వేల 948, మంగళూరులో రూ.9వేల 933, నాశిక్ లో రూ.9వేల 936, మైసూరులో రూ.9వేల 933, అయోధ్యలో రూ.9వేల 948, బళ్లారిలో రూ.9వేల 933, గురుగ్రాములో రూ.9వేల 948, నోయిడాలో రూ.9వేల 948గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 050 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 330గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 21వేల వద్ద ఉంది.