
- సీఎస్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలంటూ ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు చూడొద్దో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ కె.రామకష్ణారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదరి శ్రీదేవికి నోటీసులిచ్చింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలంటూ ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలన్న ఉత్తర్వులను అమలుచేయకపోవడంపై నారాయణపేట్‌కు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన బెంచ్ ఇటీవల విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.