
ధర్మారం, వెలుగు: దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో భక్తులు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీకి ఆలయ కమిటీ చైర్పర్సన్ నూతి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
దుర్గా మాత ఆలయానికి, కొత్తపల్లి గ్రామంలోని శీత్ల భవాని ఆలయానికి సౌకర్యాలు కల్పించాలని కమిటీ సభ్యులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎంపీ వెంట కాంగ్రెస్ లీడర్లు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, రాజేశం గౌడ్, రాజలింగయ్య, స్వామి, కిశోర్, సాయివినీత్, సత్యనారాయణ, ఎల్లయ్య, అస్షు, కృష్ణ పాల్గొన్నారు.