న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ జస్‌పే యూనికార్న్ క్లబ్‌లో చేరింది. తాజాగా 50 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.458 కోట్ల)ను వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11 వేల కోట్ల) వాల్యూయేషన్ దగ్గర సేకరించింది. ఒక స్టార్టప్ వాల్యూయేషన్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,100 కోట్ల) కంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీని యూనికార్న్‌గా పిలుస్తారు.
తాజా ఫండ్స్‌ను సిరీస్ ఫాలో-ఆన్ రౌండ్‌లో జస్‌పే సమీకరించింది. గత సంవత్సరం ఈ స్టార్టప్ వాల్యుయేషన్ 900 మిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ వార్షిక టోటల్ పేమెంట్ వాల్యూమ్ ట్రిలియన్ డాలర్లను దాటింది. జస్‌పే రోజుకు 300 మిలియన్ డాలర్ల లావాదేవీలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, హెచ్‌ఎస్‌బీసీ, స్విగ్గీ కోసం ప్రాసెస్ చేస్తోంది.
