నైట్‌ కాలేజీలో లా చేసి జడ్జిగా ఎదిగా

నైట్‌ కాలేజీలో లా చేసి జడ్జిగా ఎదిగా
  • జస్టిస్‌ చల్లా కోదండరామ్‌

హైదరాబాద్, వెలుగు: వ్యాపారం చేసి చేతులు కాల్చుకుని హైదరాబాద్‌ రావాల్సి వచ్చిందని, నైట్‌ కాలేజీలో లా చేసి న్యాయవాదిగా, ఆ తర్వాత న్యాయమూర్తిగా ఎదిగానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ చెప్పారు. జస్టిస్‌ చల్లా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం ఫుల్‌ కోర్టు సమావేశం జరిగింది. వీడ్కోలు సమావేశానికి చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ అధ్యక్షత వహించారు. కర్మ సిద్ధాంతమే మనల్ని ముందుకు నడిపిస్తుందని, ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో జరుగుతుందని, అంతమాత్రాన చింతించాల్సిన అవసరం లేదని జస్టిస్‌ చల్లా అన్నారు. చీఫ్‌ జస్టిస్‌ హీమాకోహ్లీ మాట్లాడుతూ.. జస్టిస్‌ చల్లా 18,890 రిట్లు, 13,752 మధ్యంతర పిటిషన్లను పరిష్కరించి ఆదర్శమయ్యారని చెప్పారు.