
ఢిల్లీ : సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ సిఫార్సు చేశారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి నవంబర్ 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేసే ముందు.. నూతన సీజేఐగా సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. దీంతో జస్టిస్ డివై చంద్రచూడ్ దేశానికి 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే ఛాన్స్ ఉంది.
అంతకుముందు.. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కొత్త సీజేఐ పేరు సిఫార్సు చేయాలంటూ అక్టోబర్ 7న ప్రస్తుత సీజేఐ లలిత్‌కు లేఖ రాశారు. దీంతో ఇవాళ భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ సిఫార్సు చేశారు.