- సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి
భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుస్నాబాద్, వెలుగు: మావోయిస్టు హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని, తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన ప్రచార జాత మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు చేరింది.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ మారణహోమం సృష్టిస్తోందని ఆరోపించారు. అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఆపరేషన్కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లను చేస్తోందని విమర్శించారు. ఎర్రజెండా పార్టీలు ఏకమయ్యేందుకు పునరాలోచించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేండ్ల ఉత్సవాలకు దేశ,విదేశాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనువాస్, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి,రాష్ట్ర నేతలు కలవేని శంకర్, అనిల్, రమాదేవి, సంతోష్, రమేశ్పాల్గొన్నారు.
