కాంగ్రెస్ హయాంలోనే ముదిరాజ్లకు న్యాయం : నీలం మధు ముదిరాజ్

కాంగ్రెస్ హయాంలోనే ముదిరాజ్లకు న్యాయం : నీలం మధు ముదిరాజ్
  •     నీలం మధు ముదిరాజ్ వెల్లడి

నర్సాపూర్, వెలుగు: కాంగ్రెస్ హయాంలోనే ముదిరాజులకు న్యాయం జరుగుతోందని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌‌‌‌‌‌‌‌లో పండుగ సాయన్న 174వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముదిరాజులు ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. 

ఉన్నత చదువులు చదివి గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చాలని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.