ఏపీలో 100 స్థానిక సంస్థలకు నవంబర్‌‌‌‌‌‌‌‌ 1న పోలింగ్‌‌‌‌‌‌‌‌..రీషెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ

ఏపీలో 100 స్థానిక సంస్థలకు నవంబర్‌‌‌‌‌‌‌‌ 1న పోలింగ్‌‌‌‌‌‌‌‌..రీషెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ

హైదరాబాద్, వెలుగు: ఏపీలో  మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీ) రీషెడ్యూల్ ప్రకటించింది. 100 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 28 జరగాల్సిన పోలింగ్‌‌‌‌‌‌‌‌ను  నవంబరు 1కి మారుస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌‌‌‌‌‌‌‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 

నామినేషన్ల సందర్భంగా వివాదాలు చోటు చేసుకున్న కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిల్లో ఈ నెల 23, 24వ తేదీల్లో మరోసారి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్నారు.