బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా కోమలి నాయక్

బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా కోమలి నాయక్

హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్య తండాకు చెందిన మాలోత్ కోమలి నాయక్​బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైన ఆఫీస్ బేరర్ ఆమెనే కావడం గమనార్హం. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు హేమాంగ్ జోషి సహా రాష్ట్ర నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  

వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువతను భాగస్వాములను చేస్తూ నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. కర్నాటక రాష్ర్టానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బసవరాజ్ నాయక్ కుమార్తె కాగా.. తెలంగాణ కోడలుగా ఉన్నారు.