2029 నాటికి నషా ముక్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాలి : గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా

2029 నాటికి నషా ముక్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాలి : గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా
  • డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి: గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా
  •     నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైభవంగా ‘దత్తన్న అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ 
  •     ఆత్మీయతను చాటిచెప్పే సంప్రదాయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి పథంలో సాగాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహితంగా మార్చేందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా పిలుపునిచ్చారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మూలన పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘నషా ముక్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వికసిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ నినాదంతో నిర్వహించిన ‘దత్తన్న అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సతీమణి జానకీ శుక్లా ఆయన వెంట ఉన్నారు. హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు ప్రధాని మోదీ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యతిరేక ఉద్యమానికి దిశానిర్దేశం చేశారని శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్లా తెలిపారు. తెలంగాణలోనూ గతంలో ఎల్బీ స్టేడియంలో సీఎం, మంత్రుల సమక్షంలో 15 వేల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించామని గుర్తుచేశారు. 

ఈ నెల 28న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఏకం చేయడంలో అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక పాత్ర పోషిస్తోందని, 2005లో బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని విజయలక్ష్మి విజయవంతంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా కళాకారులు, నాయకులను ఒకే వేదికపైకి తెస్తోందని పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గులాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కటారియా అన్నారు. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య తీవ్రంగా ఉందని, చిన్నపిల్లలు సైతం వ్యసనాలకు బానిసలవుతూ కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

షేర్ ​అండ్​ కేర్​తత్వం పెరగాలి: వెంకయ్య నాయుడు

అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆత్మీయ కలయికకు, విభేదాలు వీడి ఒక్కటయ్యేందుకు వేదిక అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సమాజంలో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తత్వం పెరగాలని, దేశానికి ఐక్యత అవసరమని చెప్పారు. హిందూ జీవన విధానంలోని గొప్పతనాన్ని వివరించారు. సంస్కృతితోపాటు మాతృభాషను కాపాడుకోవాలని సూచించారు. మాతృభాష కంటిచూపు వంటిదైతే, ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్లద్దాల వంటిదని పేర్కొన్నారు. వికసిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధనకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దత్తాత్రేయ, విజయలక్ష్మిలను అభినందించారు.

హిందువులంతా ఐక్యంగా ఉండాలి: కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కొందరు హిందూ దేవుళ్లను అవహేళన చేస్తున్నారని, దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే పండుగలు, సంస్కృతిని కాపాడుకోగలరని అన్నారు.

కలిసి పనిచేద్దాం: మంత్రి పొన్నం

తెలంగాణ సంస్కృతి, ఆచారాలను భావితరాలకు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. అమరుల త్యాగాలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కలిసి పనిచేయాలని, తెలంగాణ అభివృద్ధి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.

తెలంగాణ ఆత్మకు రూపం: గడ్డం ప్రసాద్

అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ ఆత్మ, జీవన విలువలకు ప్రతీక అని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. దసరా తర్వాత అందరూ ఆప్యాయంగా కలుసుకునే గొప్ప వేదికగా అభివర్ణించారు. దత్తాత్రేయకు అన్ని పార్టీల్లోనూ మిత్రులున్నారని, ఆయన వారసత్వాన్ని విజయలక్ష్మి సమర్థంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.

తెలుగు రాష్ట్రాలు కలిసి ఎదగాలి: బండారు దత్తాత్రేయ

కుల, మత, ప్రాంత, రాజకీయ భేదాలు లేకుండా అందరూ కలిసే వేదిక అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా ‘నషా ముక్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వికసిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ నినాదంతో ఈ ఏడాది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలు స్నేహభావంతో కలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అంటే ఆత్మగౌరవం: విజయలక్ష్మి

తెలంగాణ సంస్కృతి ఆత్మగౌరవానికి, అన్యాయాన్ని ఎదిరించే పోరాట పటిమకు ప్రతీక అని అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండారు విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ డప్పు దరువులు, సంప్రదాయ పిండివంటలకు ప్రత్యేకత ఉందన్నారు. ప్రజలు, నాయకుల సహకారంతోనే ఏళ్లుగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు తదితరులు పాల్గొన్నారు.

‘నషా ముక్త్ భారత్’ ఇతివృత్తం అభినందనీయం: ప్రధాని మోదీ

అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రజల్లో ప్రేమ, సోదరభావాన్ని పెంపొందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. తెలంగాణ సంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ ఏడాది ‘నషా ముక్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వికసిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2047’ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం జాతీయ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. 

రాజకీయాల్లో కావాల్సింది దోస్తానా: మంత్రి వివేక్ వెంకటస్వామి
రాజకీయ విభేదాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ప్రేమానురాగాలు, ఆత్మీయతను చాటిచెప్పే గొప్ప సంప్రదాయం ‘అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దసరా పండుగ సమాజానికి నేర్పే స్నేహం, ఐక్యత అనే గొప్ప సందేశాలను ఈ కార్యక్రమం ద్వారా దత్తాత్రేయ సమాజానికి చాటిచెబుతున్నారని కొనియాడారు. రాజకీయ నాయకుల మధ్య ఉండాల్సింది శత్రుభావం కాదని, ప్రజల కోసం పనిచేస్తూనే పరస్పర గౌరవం, స్నేహభావం కలిగి ఉండాలని ఈ వేదిక గుర్తుచేస్తోందన్నారు.