సుద్దాల హనుమంతు పాటలతో ప్రజా శక్తుల ఉద్యమ బాట: జాతీయ పురస్కారాల పోస్టర్ఆవిష్కరణ

సుద్దాల హనుమంతు పాటలతో ప్రజా శక్తుల ఉద్యమ బాట: జాతీయ పురస్కారాల  పోస్టర్ఆవిష్కరణ
  • సుద్దాల అశోక్ తేజ

ముషీరాబాద్,వెలుగు : సుద్దాల హనుమంతు పాటల ద్వారా ప్రజా శక్తులు ఉద్యమ బాట పట్టాయని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఈనెల 26న రవీంద్ర భారతి లో జరిగే సుద్దాల హనుమంతు 15వ జాతీయ పురస్కారాల పోస్టర్ ను గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ప్రముఖులతో కలిసి సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించి మాట్లాడారు. 

సుద్దాల హనుమంతు, జానకమ్మల స్ఫూర్తిని, ప్రజా పాటల వారసత్వాన్ని తాను బతికినంత కాలం తన తర్వాత కూడా వారి వారసులు నిర్వహించేలా  ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జి.రాములు, భూపతి వెంకటేశ్వర్లు, వలస సుభాష్ చంద్రబోస్, ఎన్ సోమయ్య, మందుల విప్లవ కుమార్  పాల్గొన్నారు.