హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసింది. రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన అభ్యర్థులు ఈ నెల 30 నుంచి నవంబర్ 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 18–డిసెంబర్ 1 వరకు, రూ.200తో డిసెంబర్ 3–14 వరకు, రూ.500తో డిసెంబర్ 16–28 వరకు హెచ్ఎంలకు చెల్లించే అవకాశం కల్పించింది.
రెగ్యులర్ విద్యార్థుల అన్ని సబ్జెక్టులకు ఫీజు రూ.125. గతంలో ఫెయిలై మూడు సబ్జెక్టుల వరకు రాసేవారు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతోపాటు అదనంగా రూ.60 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
