నాలుగు నెలలుగా జీతాల్లేవ్‌..నాచారం ESI హాస్పిటల్లో కార్మికుల సమ్మె

నాలుగు నెలలుగా జీతాల్లేవ్‌..నాచారం ESI హాస్పిటల్లో కార్మికుల సమ్మె

ఉప్పల్, వెలుగు : నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నాచారం ఈఎస్ఐ దవాఖాన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌కార్మికులు గురువారం డ్యూటీలు బహిష్కరించారు.  జీతాలు చెల్లించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మాట్లాడుతూ గతంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇస్తే..ఈ నెల 19లోగా జీతాలు ఇస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారన్నారు. అయినా, నిలబెట్టుకోలేదన్నారు. వేతనాలు చెల్లించకపోతే సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.