కేసీఆర్ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ కు నీటి మళ్లింపుపై విచారణ జరపండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ కు నీటి మళ్లింపుపై విచారణ జరపండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్‌‌‌‌‌‌‌‌కు ఎంపీ చామల లేఖ
  •     ‘వెలుగు’ పేపర్ క్లిప్‌‌‌‌‌‌‌‌ను లెటర్‌‌‌‌‌‌‌‌కు జతచేసిన ఎంపీ

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు కొండపోచమ్మ సాగర్ నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్‌‌‌‌‌‌‌‌కు గురువారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ప్రాజెక్టు రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందో లెక్క తేలుతుందన్నారు. ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు నీళ్ల తరలింపుపై ఇటీవల ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆ లేఖకు ఎంపీ జత చేశారు. 

వీలైనంత త్వరగా కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువుకు, అక్కడి నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు నీటి తరలింపుపై దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫాంహౌస్ కోసం కేసీఆర్ మూడు ఎకరాల్లో బావి తవ్వించారని ఆరోపించారు. ఈ విచారణలో ప్రాజెక్టు రికార్డులు, అప్రూవల్స్, కాలువల అంశాలపై సమగ్రంగా పరిశీలించి రిపోర్ట్ అందించాలని ఇరిగేషన్ సెక్రటరీని ఎంపీ కోరారు.