- కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యాంకోశీని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) బోర్డు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలో మొదటిసారిగా ఒక న్యాయమూర్తి నల్సా బోర్డులో సభ్యులుగా ఎంపిక కావడం విశేషం.
1967 ఏప్రిల్ 30న జన్మించిన జస్టిస్ శ్యాంకోశీ.. 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేసిన ఆయన.. 2013లో చత్తీస్‌గఢ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2016లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జులై 27న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
