రాజ్యాంగ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందాలి : హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

రాజ్యాంగ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందాలి : హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

రాజ్యాంగ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందాలన్నారు హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు రాసిన తొవ్వ ముచ్చట్లు పుస్తకం నాలుగో భాగాన్ని జస్టిస్ చౌహాన్ ఆవిష్కరించారు. భారతీయ నాగరికత… ఆదివాసీ, గిరిజన తండాల నుంచే మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో జయధీర్ తిరుమలరావుతో పాటు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, పాలమూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గూడూరు మనోజ పాల్గొన్నారు.