కోతుల దాడిలో గాయపడ్డ వారికి న్యాయం చేయాలి.. ఆఫీసును ముట్టడించిన అంగన్​వాడీలు

కోతుల దాడిలో గాయపడ్డ వారికి  న్యాయం చేయాలి.. ఆఫీసును ముట్టడించిన అంగన్​వాడీలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: కోతుల దాడిలో గాయపడిన అంగన్​వాడీ టీచర్, హెల్పర్​కు న్యాయం చేయాలని, సెలవురోజుల్లోనూ పనులు చెప్పిన సీడీపీవోను సస్సెండ్ చేయాలంటూ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని  చైల్డ్ డెవలప్​మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)  ఆఫీసును ముట్టడించారు. కోతుల దాడిలో గాయపడిన బాధితులతో కలిసి ధర్నా చేశారు. 

అనంతరం సీడీపీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా అంగన్​వాడీలు మాట్లాడుతూ..  మండలంలోని రాయపోల్​ అంగన్​ వాడీ సెంటర్ –4ను ఆదివారం సీడీపీవో ఆదేశాలతో టీచర్​ భారతమ్మ, హెల్పర్ ​తాహెరబేగం తెరిచారని.. అక్కడ కోతులు వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయన్నారు. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారన్నారు. సీపీడీవోను సస్పెండ్ చేసి  బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. అంగన్ వాడీ యూనియన్ నేతలు వైదేహి తదితరులు పాల్గొన్నారు.