హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో ట్రెయినింగ్ తీసుకున్న ఇండియా పారా సైక్లింగ్ టీమ్ కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరిగిన ఆసియా పారా సైక్లింగ్ రోడ్ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటింది. మహారాష్ట్రకు చెందిన జ్యోతి గదేరియా 16. కి.మీల విమెన్స్ వీల్ చైర్2- ఈవెంట్‌లో 32.21 నిమిషాల టైమింగ్‌తో గోల్డ్ నెగ్గింది. మెన్స్ సి2 కేటగిరీలో ఏపీ సైక్లిస్ట్ చెందిన షేక్ అర్షద్ (26.38 ని) సిల్వర్ నెగ్గగా, హ్యాండ్ సైక్లిస్ట్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ (29.29 ని) సిల్వర్, యోగేష్ (35.41 ని) బ్రాంజ్ గెలిచారు. అర్షద్, జ్యోతి ఇప్పటికే పారాలింపిక్స్ కు క్వాలిఫై అయ్యారు.