బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత

 బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన కె.హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన వెంకటేశ్ ధోత్రే రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ కాగా ఆయన స్థానంలో హరిత ఆసిఫాబాద్ కు వచ్చారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, కలెక్టరేట్ అధికారులు కొత్త కలెక్టర్ కు బొకే అందజేసి స్వాగతం పలికారు.