పాల్వంచ, వెలుగు : మండలంలోని కిన్నెరసానిలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కే.హర్షిత్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన హర్షిత్ అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ఎస్ శ్యాంకుమార్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ రాకేశ్, పీడీ నాగార్జున పాల్గొన్నారు.
