బీజేపీకి మరోసారి చాన్స్ ఇవ్వండి : లక్ష్మణ్

బీజేపీకి మరోసారి చాన్స్ ఇవ్వండి : లక్ష్మణ్
  •     రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ 

ముషీరాబాద్,వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అధికారం చేపట్టేందుకు చాన్స్ ఇవ్వాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్  ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ముషీరాబాద్ లోని మహాత్మానగర్, ఇంద్రనగర్, సంజీవయ్య నగర్, ఎస్ బీఐ కాలనీ తదితర బస్తీలతో పాటు ఇందిరాపార్క్ లోని వాకర్స్ ను కలిసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి మనమందరం దోహదపడాలని సూచించారు. ఆయన వెంట పూస రాజు, కన్వీనర్ రమేష్ రామ్, వేముల అశోక్, కార్పొరేటర్ రచన శ్రీ, బిజ్జి కనకేశ్​కుమార్ ఉన్నారు.