మహనీయుల చరిత్రను భావితరాలకు అందిద్దాం: లక్ష్మణ్​ 

మహనీయుల చరిత్రను భావితరాలకు అందిద్దాం: లక్ష్మణ్​ 

ఎల్​బీనగర్,వెలుగు: దేశం కోసం.. ప్రాంతం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చరిత్రను భావి తరాలకు అందించాల్సిన బాధ్యతను బీజేపీ తీసుకొని ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’ మహోత్తమ కార్యక్రమం నిర్వహిస్తుందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ బీజేపీ మోర్చా  జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. నాగోల్ డివిజన్ సాయి నగర్ కాలనీలో సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మేరా మాటీ.. -మేరా దేశ్’ ఇంటింటికి బీజేపీ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొని మాజీ సైనికులను సన్మానించారు.

అనంతరం లక్ష్మణ్​ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్యం కోసం అమరులైన మహనీయుల చర్రిత వెలుగులో తీసుకురావడానికి దేశం నలుమూలల నుంచి మట్టిని సేకరించి దేశరాజధాని ఢిల్లీలో అమృతవాటికను నిర్మించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రపంచ నేతలు మోదీని కొనియాడుతుంటే.. మన ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. అనంతరం బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ..  ప్రపంచ దేశాలు భారత సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడుతుంటే, కొంతమంది ఓర్చుకోలే విమర్శలు చేస్తున్నారన్నారు.