మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలి : కె. నవీన్ కుమార్ రెడ్డి

మైనారిటీ గురుకులాల్లో  ప్రవేశాలకు అప్లై చేసుకోవాలి : కె. నవీన్ కుమార్ రెడ్డి

ఎల్​బీనగర్,వెలుగు : రంగారెడ్డి జిల్లాలోని 9 మైనారిటీ గురుకుల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె. నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. హయత్ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, బాలాపూర్ (బాలురు), ఇబ్రహీంపట్నం,రాజేంద్రనగర్, హయత్ నగర్, ఫరూఖ్ నగర్, మొయినాబాద్ (బాలికల) ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూప్స్,  5వ తరగతిలో ప్రవేశానికి,  6, 7, 8వ తరగతుల బ్యాక్ లాగ్ ఖాళీలను (మైనార్టీలకు మాత్రమే) భర్తీ చేస్తున్నామని, ఆన్ లైన్ లో 6.2.2024లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

జిల్లాలోని గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశానికి మైనారిటీలు(ముస్లిం, క్రైస్తవ, పార్సి ,సిఖ్, జైన్, బుద్ధిస్ట్) విద్యార్థులకు 75 శాతం సీట్లతో పాటు నాన్ మైనారిటీలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులకు) 25% రిజర్వేషన్ ఉందన్నారు.ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ లో  tmreistelangana.cgg.gov.in  అప్లై చేసుకోవాలని సూచించారు.

వికారాబాద్:  వికారాబాద్ జిల్లాలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఈనెల 18 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ అభివృద్ధి శాఖ అధికారిణి సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలో వికారాబాద్‌‌‌‌లో బాలుర, బాలికల, తాండూర్ లో బాలుర, బాలికల, పరిగి, కొడంగల్ లో బాలుర గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు.

ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి విద్యార్థుల నుంచి ప్రవేశాలు కోరుతున్నట్లు ఆమె చెప్పారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో , టీఎంఆర్ఈఐఎస్ మొబైల్ అప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.  సందేహాలు ఉంటే 9959746436  నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేయాలన్నారు.